ఘనంగా సీత్లా పండుగ

ప్రజా సంగ్రామం/నూతనకల్

Jul 9, 2024 - 19:59
 0  3
ఘనంగా సీత్లా పండుగ

బంజారాల అరాధ్య దైవం సీత్లా పండుగను  మండలంలోని వివిధ గిరిజన తండాల్లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆరాధ్య  దైవంగా భావించే సిత్లా అమ్మవార్లకు గిరిజన మహిళలు ప్రత్యేకంగా వండిన పులగం, ఎండు మిరపకాయలు, గడ్డలు, జొన్న గుగ్గిళ్ళను అమ్మవారికి చెల్లించి  మొక్కులు తీసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి తమ గుడ్డు గోదా, పంట పొలాలు బాగా పండి తమ ఇంట సిరులు కురియాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లంబాడి భాషలో లయబద్ధమైన పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మండలంలోని అన్ని గిరిజన తండాలో సీత్ల పండుగను నిర్వహించుకుని ఐక్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు గుగులోతు నర్సింగ్ నాయక్, మూడ్ రవీందర్ నాయక్,సురేందర్, అప్పా నాయక్, శంకర్ నాయక్, కృష్ణ నాయక్, వస్త్రం, మూడు శంకర్, జలంధ నాయక్, వీరన్న నాయక్, పాతులోతు నాగు నాయక్, శ్రీను నాయక్, గుగులోతు రమేష్ నాయక్, లింగా నాయక్ తోపాటు గిరిజన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333