తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైంజ్ శాఖ నయ ధందా...

Aug 29, 2024 - 21:57
Aug 29, 2024 - 22:00
 0  2
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైంజ్ శాఖ నయ ధందా...

వైన్స్ అధిక ధరలను ఖడిస్తున్నా తెలంగాణ రాష్ట్ర బంజార

గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బి.మంగీలాల్ నాయక్.

సీసా మీద ఎం.ఆర్.పి ధర.... వైన్స్ శాఖ యజమాని చేతిలో అధిక ధర...

ఏజెన్సీ ప్రాంతంలో అమాయక ప్రజల రక్తం తాగుతున్న వైన్స్ యాజమాన్యం.

ఏజెన్సీలో గిరిజన చట్టాలను బేఖాతర్ చేస్తున్న గిరిజనేతరులు.

కల్తీ వైన్స్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైన్స్ యాజమాన్యం.

ఏజెన్సీ ఏరియాలో వైన్స్ ఎం.ఆర్.పి ధర కంటే 20% నుండి 30% వరకు అధిక ధరలు.

ఉమ్మం ఖమ్మం 30 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని , అన్ని మండలాలలో ఉన్నటువంటి వైన్స్ షాపుల ద్వారా గిరిజన గ్రామాలలో, తండాలలో, గుడాలలో మధ్యం అక్రమంగా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు ఆటోల ద్వారా మధ్యం విక్రయిస్తున్నారు. ఎం.ఆర్.పి. రేటు కంటే 20% నుంచి 30%శాతం అదనంగా విక్రయిస్తున్నారు. అటువంటి వైన్స్ షాపుల లైసెన్స్ లను రద్దు చేయాలి. కేవలం వారు వైన్స్ షాపులలోనే విక్రయాలు చేయాలి. కాని రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాలలో వైన్స్ షాపుల యాజమాన్యం, స్థానిక ఎక్సైజ్ శాఖ సిబ్బందులు కలిసి సిండికేట్స్ లు ఏర్పడి ఆటోలలో, మిని టాటా ఎ.సి లలో ఆక్రమంగా గ్రామాల్లో బెల్టు షాపులలో మధ్యం విక్రయిస్తున్నారు అని బంజార గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బి. మంగీలాల్ నాయక్ ఖండిస్తున్నారు.

 వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వైన్స్ షాపు యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎం.ఆర్.పి. ధరకంటే అధికంగా 20% అధిక ధరలకు విచ్చల విడిగా అమ్ముతున్నారు. వాటిని అరికట్టమని జిల్లాలో జిల్లా పరిపాలన అధికారి జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ కమీషనర్ ఎక్సైజ్ కు అనేక సార్లు మా సంఘం ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయము హైదరాబాద్ లో ఎక్సైజ్ కమీషనరికి మరియు రాష్ట్ర మంత్రి వర్యంలో ఎక్సైజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా దీని మీద ఎటువంటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అదికార యంత్రాంగం కానీ, జిల్లా అధికార యంత్రాగం కానీ, ఎటువంటి స్పందన లేదు.

 ఈ అక్రమ మద్య రవాణా చేయడానికి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టిచుకోవడం లేదు. జిల్లాల్లోని వివిధ మండలాల్లోని ఎక్సైజ్ యస్ఐలు సి.ఐ.లు మరియు వైన్స్ షాపు సిండికేట్  యజమానులు కుమ్మకై వైన్స్ మందు బాటిళ్ళను ఆటోలు, మినీ టాటా ఎ.సి. వ్యాన్లు ద్వారా 20%శాతం అధిక ధరలకు అమ్మిస్తున్నారు. దీని మూలంగా గ్రామలలో కల్తీ మందులు, చీఫ్ లిక్కర్లు త్రాగి అనేక గిరిజన గ్రామాల్లో గిరిజనులు మధ్యానికి బానిసై వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ప్రాణాలు విడుతున్నారు. వీరిపై ఆధారపడి గిరిజన కుటుంబ సభ్యులు ఆకలికి అలమటిస్తున్నారు. మన ప్రభుత్వం ప్రజా పాలన అన్నట్టు... వైన్స్ శాఖ ప్రజా పాలన నడుస్తుంది... మన రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలి అన్నట్టు... వైన్స్ శాఖ వారు వైన్స్ ను ప్రజలకు ప్రజల వద్దకే వైన్స్ షాపుల ద్వారా కాకుండా గ్రామలలో బెల్టు షాపుల ద్వారా అందించాలని వైన్స్ శాఖ వారు కంకణం కట్టుకుంది. అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాత్యులు, తెలంగాణ ప్రభుత్వము, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ అధికారుల వైన్స్ షాపుల యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర బంజారా గిరిజన హక్కుల పారాట సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని బి. మంగీలాల్ నాయక్ హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333