రైతుగా కష్టపడాలి రాజులా బ్రతకాలి రైతే రాజు ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 29 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వారి వ్యవసాయ క్షేత్రంలో పొలం పనుల్లో ఎమ్మెల్యే ఆదివారం కూలీలతో కలసి వరినాట్లులో నిమగ్నమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..నాకు కూలీల అందరితో కలిసి పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.నేను ఒక రైతునే కాబట్టి నాకు రైతు కష్టాలు తెలుసు పదవి ఉన్నా లేకున్నా నాకున్న అయిదు ఎకురాల పొలం నాటు పెట్టుకుంటూ..కౌలుకి 20 ఎకరాలు సాగు చేస్తున్నారన్నారు. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అల్పేమే ఉంటది అన్న సామెతగా పనిలో..నిమగ్నమయ్యారు.కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రైతులకు రెండు లక్షల రుణమాఫీ పెద్ద పీట వేసిందన్నారు.రైతే రాజు అన్నట్లుగా వ్యవసాయం పండగలా..మారిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేసారని తెలిపారు.రైతులు పండించిన పంటకు సన్న వడ్లకు క్వింటాకి 5వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు. కూలీలతో పనులు చేస్తుంటే టైమే తెలుస్తలేదని చెప్పుకొచ్చారు.