ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం
ఖమ్మం జిల్లా:జులై 20:- ఖమ్మం జిల్లా పాలేరు నియో జకవర్గంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన బి, వెంకటమ్మ (70) కూలి పనిలో భాగంగా. ఈరోజు పొలం పనికి వెళ్లిన వెంకటమ్మను పాము కాటు వేయడంతో..
దీంతో ఆందోళన చెందిన తోటి కూలీలు హుటాహు టిన ఖమ్మం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రికీ తరలించారు. పాము కాటుకు గురైన మహిళను పట్టించుకోకపోగా అడిగిన వారిపై ఏమి కాదులే అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు. అక్కడి డాక్టర్లు...
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుతో ముగ్గురు మహిళ డాక్టర్లు ఉన్న వెంకటమ్మ విషయం లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు.
పాము కాటుకు గురైన మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే పేసెంటును పట్టించుకునే వారే లేరని ముగ్గురు మహిళల డాక్టర్లు గదిలో కూర్చొని ముచ్చట్ల తో కాలయాపన చేస్తున్నారని అక్కడి పేషంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు.
దవాఖానకు వచ్చే రోగులతో కూడ సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని, స్థానికులు ఆరోపిస్తున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని, అక్కడ ఉన్న పేషంట్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు...