న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఫోకస్

Dec 29, 2024 - 21:29
 0  7
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఫోకస్

హైదరాబాద్ డిసెంబర్ 29 నూతన సంవత్సర వేడు కల సందర్భంగా హైదరా బాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నూతన సంవత్సరాన్ని దృ  ష్టిలో పెట్టుకొని తనిఖీలను నిర్వహించారు. 

నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అనుమతులు ఎంత వరకు ఉన్నాయన్న దానిపై పోలీసులు ద్రుష్టి పెట్టారు. 

బార్లు, పబ్ లలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసినట్లు మా దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామ న్నారు. డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగ తనిఖీలు చేప ట్టారు. మైనర్‌లకు ఎట్టి పరిస్థితి లో బార్లకు, పబ్ లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

సౌండ్ పొల్యూషన్‌తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలను పబ్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకో వాలని పబ్ యజమాను లకు హెచ్చరించారు. 

ఎట్టి పరిస్థితిలలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలను అనుమ తించిన కఠిన చర్యలు వుంటాయని హెచ్చరిం చారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333