రెండవసారి సర్పంచ్ అభ్యర్థిగా మామిళ్ళపల్లి చక్రవర్తి
03-12-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామ సర్పంచ్ గా రెండవసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మామిళ్ళపల్లి చక్రవర్తి. నామినేషన్
మామిళ్ళపల్లి చక్రవర్తికి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు గ్రామం అభివృద్ధి చెందాలి అంటే యువకులే ఉండాలి నీలాంటి గొప్ప తెలివి ఉన్న నాయకుడే గ్రామానికి కావాలి అని రెండవసారి కూడా చక్రవర్తినే బలపరిచారు అంటే గ్రామస్తులలో చక్రవర్తి పై ఉన్న నమ్మకం.
చక్రవర్తి మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నినాదంతో కార్యకర్తలు నా మీద ఉంచిన నమ్మకంతో మీ అందరి అభిమాన సేకరణతో నేను ముందుకు వెళ్తానని రాములవారికి నమస్కారాలు చేసుకుని కార్యకర్తల ఆశీర్వాదంతో పెద్ద ర్యాలీతో నామినేషన్ కు బయలుదేరి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు అయినటువంటి మామిళ్ళపల్లి కురుమయ్య, క్యాథూరి రాముడు, అల్లం రవి, కుమ్మరి బుచ్చన్న, అవ్వల్ల వెంకటస్వామి, మామిళ్ళపల్లి శ్రీరాములు, క్యాతూరి అయ్యన్న, వెంకటేశ్వరరావు, గుమ్మడం బాలేశ్వరి, ఎస్ఎఫ్ఐ నేత ఆది, చిన్న కురుమయ్య, మేకల సతీష్, నీరు కట్టి నరసింహ, ఎలమ రాజు, గొందిపర్ల మేఘ రాజు, తూముకుంట కురుమయ్య, యువకులు,పాల్గొన్నారు.