సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక
తిరుమలగిరి 03 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
స్థానిక సంస్థల తొలి విడతలో భాగంగా రాజ్ నాయక్ తండావాసులు ఏకగ్రీవంగా సర్పంచ్ మరియు వార్డు నెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జలాల్పురం ఉమ్మడి గ్రామపంచాయతీలోని కొత్తగా ఏర్పాటు అయిన రాజన్న రాజ్య నాయక్ తండ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ భూఖ్య బిచ్చు ను మరియు వార్డ్ మెంబర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచి భూక్య బిచ్చు మాట్లాడుతూ తండ అభివృద్ధికై పాటుబడతానని ఎలాంటి మోసాలకు పాల్పడనని ప్రజలకు ఎల్లవేళలా తోడు ఉంటానని అలాగే నాకు సహకరించిన రాజా నాయక్ తండా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు..