రివర్ ఆసుపత్రి ని ప్రారంబించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ 1 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- మిర్యాలగూడ పట్టణం చర్చిరోడ్డు లో నూతన డాక్టర్. అంజి రెడ్డి రివర్ ఆసుపత్రి ని ఏర్పాటు చేశారు. కాగా ఈ రోజు ఆసుపత్రి ప్రారంబొత్సవ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిదిగా మాజీ శాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావుహాజరై అసుపత్రిలోని EMT, సిజేరియన్ వార్డులను ప్రారంబించారు ఈ సందర్బంగా భాస్కర్ రావు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అలాగే పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఫీజు విషయంలో అందుబాటులో ఉండేలా వైధ్యం అందించాలని కోరారు. కార్యక్రమములో డాక్టర్. అంజి రెడ్డి, మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిపి ఒగ్గు జానయ్య, నాగరాజు, ఆర్. ఏం.పిలు, పి ఏం.పి లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.