రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్
జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల 2025 సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు క్రైమ్ రివ్యూ మీటింగ్ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడింది.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నేర పరిస్థితులు, కేసుల విచారణ పురోగతి, శాంతి భద్రతా చర్యలు, మహిళా-శిశు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ వంటి ముఖ్య అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.
ఈ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు హాజరై జిల్లా నేర గణాంకాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తుల పురోగతి మరియు నేర నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల వివరాలను సమర్పించారు.
రాష్ట్ర డీజీపీ జిల్లాల వారీగా పనితీరును పరిశీలించి, దర్యాప్తుల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
ప్రజల భద్రతే ప్రాధాన్యంగా ఎన్ హెచ్ 44 ను అనుకోని ఉన్న గ్రామలలో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటుతో పాటు గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగులో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తో పాటు అదనపు ఎస్పీ కె. శంకర్, డి. ఎస్పీ గద్వాల్ మొగిలయ్య, పి. సి. ఆర్. ఇన్స్పెక్టర్, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారుహాజరయ్యారు