రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో సిల్వర్ బహుమతి అనూష

Sep 20, 2024 - 19:53
Sep 20, 2024 - 20:37
 0  4
రాష్ట్రస్థాయి  అథ్లెటిక్స్ లో సిల్వర్ బహుమతి  అనూష

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్: రాష్ట్రస్థాయి స్థాయి అథ్లెటిక్స్ లో సిల్వర్ బహుమతి అందుకున్న విద్యార్థిని మేడి అనూష* ఆత్మకూరు ఎస్.. తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ లాంగ్ జంప్ సిల్వర్ బహుమతి అందుకున్న ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన మేడి అనూష రెండవ స్థానంలో ఎంపికయింది. శుక్రవారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ అండర్ 16 బాలికల అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో లాంగ్ జంప్ అనుష విజయం సాధించింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మేడి నాగయ్య కుమార్తె అనూష హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొని లాంగ్ జంపులో సిల్వర్ బహుమతి అందుకుంది . అనూష ఎంపిక పట్ల పలువురు అభినదించారు.