నూతన జాతీయ విధానాన్ని అమలు చేయాలి!ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్

Sep 20, 2024 - 19:40
 0  5
నూతన జాతీయ విధానాన్ని అమలు చేయాలి!ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్

మోత్కూర్ 20 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 రద్దుకై ఉద్యమించాలి!ఏఐఎస్ఎఫ్ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ సభ్యత నమోదు కార్యక్రమం శుక్రవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ..భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం స్వాతంత్ర ఉద్యమంలో,ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి సంఘం బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు. 
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8వేల కోట్ల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 పేద విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని దానిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  మోత్కూర్ మండల కార్యదర్శి రాంపాక చందు, వినయ్, నవీన్ విద్యార్థులకు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333