రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.
తెలంగాణ వార్త మాడుగులపల్లి ఏప్రిల్ 15 : ఇందిరమ్మ ఇండ్లను రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారుమంగళవారం నాడు మాడ్గులపల్లి మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ సభ్యుడు గడగోజు వెంకటాచారి అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారుఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు విషయంలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలన్నారుగ్రామాల్లో ఇళ్ళు లేని పేదలు ఎంతో మంది ఉన్నారని కనీసం వారికి ఖాళీ స్థలం కూడా లేదన్నారుగ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి ఇళ్ళు లేని పేదలకు పంచి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలన్నారుఅదేవిధంగా యువతకు స్వయం ఉపాధి కొరకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంమహిళలకు ఆత్మీయ భరోసా వంటి పథకాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారుపెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు,పెన్షన్ లను వెంటనే మంజూరు చేయాలన్నారు.ఏండ్లు గడుస్తున్నా కూడా నూతనంగా వివాహం చేసుకున్న వారికి రేషన్ కార్డులు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని అన్నారువృద్దాప్య,వితంతుకలాల్ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారుగ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారుధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు సరైన ధర కల్పించడం లేదన్నారుఅకాల వర్షాల వలన రైతులు తీవ్ర నష్టపోయే విధంగా ఉన్నందున అన్ని రకాల ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో అర్హులైన వారిని గుర్తించాలని పథకాల అమలు విషయంలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా మంజూరు చేయాలని కోరారుఈ సమావేశంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు దేవి రెడ్డి అశోక్ రెడ్డి, పుల్లెంల శ్రీకర్, పతాని శ్రీను,అయితగాని విఘ్ణు,జూకురి నాగయ్య,ఊరుకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.