యువజన దినోత్సవం....స్వామి వివేకానంద జయంతి

Jan 12, 2026 - 17:20
 0  75
యువజన దినోత్సవం....స్వామి వివేకానంద జయంతి
యువజన దినోత్సవం....స్వామి వివేకానంద జయంతి

 జోగులాంబ గద్వాల 12 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల. చాగాపురంగ్రామపంచాయతీ ఆఫీస్ ప్రక్కన వివేకనంద జయంతి కార్యక్రమం వివేకానంద యూత్ అధ్యక్షుడు పుష్యవంతుడి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద కి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ  మాట్లాడుతూ.... యువజన దినోత్సవం అనేది కేవలం ఒక జ్ఞాపక దినం కాదు, యువత తమలోని శక్తిని గుర్తించి, స్వామి వివేకానందుల ఆశయాలను నెరవేర్చేందుకు తీసుకునే సంకల్పదినం ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన భారతదేశంలో యువజన దినోత్సవం ను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మహానుభావుడు, ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త అయిన స్వామి వివేకానందుల జయంతి. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ రోజును యువజన దినోత్సవంగా ప్రకటించింది.

స్వామి వివేకానందుడు 1863 జనవరి 12న కోల్ కత్తా లో జన్మించారు. చిన్న వయస్సులోనే అసాధారణ మేధస్సు, ధైర్యం, ఆధ్యాత్మిక ఆసక్తిని ప్రదర్శించారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి, భారతీయ సంస్కృతి, వేదాంత తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ముఖ్యంగా 1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత సభలో ఆయన చేసిన ప్రసంగం భారతదేశానికి విశ్వవ్యాప్త గౌరవాన్ని తీసుకొచ్చింది.

లేచి నిలబడండి, లక్ష్యం సాధించే వరకు ఆగకండి అనే ఆయన సూక్తి యువతకు నేటికీ ప్రేరణగా నిలుస్తోంది. స్వామి వివేకానందుడు యువతే దేశ భవిష్యత్తు అని నమ్మారు. శారీరక దృఢత్వం, మానసిక బలం, నైతిక విలువలతో కూడిన యువతే సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని ఆయన బోధించారు.

యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాల్లో నిర్వహించే ఉపన్యాసాలు, వ్యాస రచనలు, సాంస్కృతిక కార్యక్రమాలు యువతలో నాయకత్వ లక్షణాలు, సేవా భావం, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో సహాయపడతాయి.

నేటి యువత స్వామి వివేకానందుల ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నిజమైన యువజన దినోత్సవ సార్ధకత ఉంటుంది. దేశ అభివృద్ధికి తమ శక్తి, ప్రతిభను వినియోగిస్తూ, నైతిక విలువలతో కూడిన జీవితం గడపడం ప్రతి యువకుడి కర్తవ్యం.

యువజన దినోత్సవం అనేది కేవలం ఒక జ్ఞాపక దినం కాదు, యువత తమలోని శక్తిని గుర్తించి, స్వామి వివేకానందుల ఆశయాలను నెరవేర్చేందుకు తీసుకునే సంకల్పదినం ఆమె కొనియాడారు.

 ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులుఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333