మోటార్ సైకిల్ కి టిప్పర్ డీ ఇద్దరికీ గాయాలు

Nov 16, 2024 - 20:16
 0  6

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  పిట్టల అంజయ్య మరియు బయ్య ముత్యాలు ఇద్దరిది నూతనకల్ గ్రామము  మోటార్ సైకిల్ పై సూర్యాపేట నుండి నూతనకల్ వైపు వెళ్తూ మార్గ మధ్యలో కోటి నాయక్ తండా సమీపము లో ఒక టిప్పర్ వాహనము  సూర్యాపేట-దంతాలపల్లి వెళ్ళే రోడ్డు నుండి దుబ్బ తండా కు వెళ్ళే కాలువ కట్ట వైపు మలిపే క్రమములో టిప్పర్ డ్రైవర్ తన టిప్పర్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతు రోడ్డు పై వెళ్ళే మోటార్ సైకిల్ కు టక్కరు ఇవ్వగా, మోటార్ సైకిల్ నడుపుతున్న పిట్టల అంజయ్య, వెనుక కూర్చున్న బయ్య ముత్యాలు కు ఇద్దరికీ తల, కాళ్ళు, చేతులు ఇతర చోట్ల గాయాలు తగిలినవి. ముత్యాలు యొక్క తల్లి బయ్య అంజమ్మ ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు పరిచనినది. గాయ పడిన ఇద్దరు సూర్యాపేట లో చికిత్స పొందుతున్నారు.