నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి
ప్రాంతీయ ఉద్యాన అధికారి కన్న జగన్
సూర్యాపేట ప్రతినిధి :- నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని సూర్యపేట ప్రాంతీయ ఉద్యాన అధికారి కన్న జగన్ అన్నారు. సూర్యాపేట మండల పరిధిలో నీ కేసారం గ్రామం లో డాక్టర్ దండ మురళీధర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో నూతనంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటే కార్యక్రమం ను మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ తోటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని కోరారు. ఈ పంటకు కూలీ ఖర్చులు తక్కువ,కోతుల, బెడదలేద అన్నారు. ఆయిల్ ఫామ్ పంటను ప్రభుత్వం నిర్ణయుంచిన ధరకు ప్రభుత్వం నియమించిన కంపెనీ వారే విక్రయస్తారని అన్నారు ఈ కార్యక్రమం లో డాక్టర్ దండ మురళీదర్ రెడ్డి, పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ మేనేజర్ జె హరీష్, జూనియర్ మేనేజర్ శశి కుమార్ , ఫీల్డ్ అసిస్టెంట్ యానాల సుధాకర్ రెడ్డి, జైన్ డ్రిప్ ప్రతినిధి జెట్టి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.