బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆర్థిక సహాయం

Apr 22, 2024 - 16:30
 0  7
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆర్థిక సహాయం

అడ్డగూడూరు 22 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామానికి చెందిన మందుల మహేష్ ఇటీవల అకాల మరణం చెందారు. ఇట్టి విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆయన తన సానుభూతిని వ్యక్తం చేస్తూ, రూ.10వేల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ మండల నాయకత్వానికి పంపించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్యతో కలిసి సోమవారం మృతుని భార్య, పిల్లలకు అందచేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కిషోర్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తోట కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నాయకులూ పోగుల నర్సిరెడ్డి, తోట పురుషోత్తం, తోట భాస్కర్ రెడ్డి, తలపాక మహేష్, మందుల కిరణ్, తోట నవీన్ కుమార్, కొమ్మిడి అంజిరెడ్డి, మందుల కిరణ్, బాకీ సురేష్, మందుల వేణు, మందుల శ్రీకాంత్, మందుల రోషయ్య, మందుల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333