మున్సిపాలిటీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఫ్లెక్సీ లను తొలగించండి మహా ప్రభు

జోగులాంబ గద్వాల 29 జూన్ 2024 తెలంగాణ ప్రతినిధి:- కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆ ఫ్లెక్సీలు ప్రయాణికులకు ప్రమాదా నిలయంగా మారాయి.కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ కి వచ్చేవారు... మరియు పాత బస్టాండ్ నుంచి రాజీవ్ మార్గ్ వెళ్లేవారు ఇరువైపులా వాహనాలు రావడంతో ఆ ఫ్లెక్సీ ఉండడంతో కనిపించడం లేదు ఇరువైపుల నుండి వచ్చే వాహనాలు ఆ ఫ్లెక్సీ లా ద్వారా ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కావున ప్రయాణికులకు మరియు ట్రాఫిక్ కి ఎలాంటి అవంతరాయం జరగకుండా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మరియు మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించి. ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుకుంటున్నారు.