మెడికల్ కళాశాల నూతన భవన తుదిదశ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Dec 2, 2024 - 18:13
 0  5
మెడికల్ కళాశాల నూతన భవన తుదిదశ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,నాగర్ కర్నూల్ డిసెంబర్ 2 నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనాన్ని వైద్య విద్యార్థుల తరగతుల నిర్వహణకు అన్ని సదుపాయాలతో సంసిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.ఉయ్యాలవాడ సమీపంలో 25 ఎకరాల్లో నిర్మితమవుతున్న నూతన మెడికల్ కళాశాల భవనం మెడికల్ కళాశాల విద్యా ర్థుల (బాలబాలికలు) ప్రొఫెసర్ల వసతి గృహాలు నూతన భవనాలను,  నూతనంగా నిర్మితమౌతున్న మెడికల్ కళాశాల తరగతి గదుల భవనాలను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.......  నూతన మెడికల్ కళాశాలలో చివరి దశలో ఉన్న పనులను వేగవంతం పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవి, నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, నాగర్ కర్నూల్ జర్నల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333