మందుబాబులకు అడ్డాగా మారిన కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

Jun 1, 2025 - 19:44
 0  5
మందుబాబులకు అడ్డాగా మారిన కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే నాధుడే లేడా 

జోగులాంబ గద్వాల 1 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల   మందుబాబులకు అడ్డాగా మారింది.చీకటి పడితే చాలు మందుబాబులు పాఠశాల ఆవరణంలో కాంపౌండ్  లో కూర్చుని దర్జాగా మద్యం తాగుతున్నారు.తాగిన తర్వాత సీసాలు గది లోపలికి తలుపుల పక్కన పడేసి పగలగొడుతున్నారు అక్కడే వదిలేసి వెళుతున్నారు.వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే భయపడుతున్నారు. మందుబాబులు మందు ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవించడంతో అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.ప్రభుత్వ పాఠశాలల పట్ల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.ఇకనైనా అధికారులు,గ్రామస్తులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్పందించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేయాలని గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333