సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి.... రమేష్ దిల్ డియర్
మనగారా 29 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- సీజనల్ వ్యాధులు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ రమేష్ దిల్ దీయార్ అన్నారు. మండలంలో తాడ్వాయి గ్రామంలో శనివారం పరిశుభ్రత పై ఎంపిడిఓ రమేష్ దిల్ దీయార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. వార్డుల్లో డ్రైనేజీలు, రోడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. మలేరియా, డెగీ కేసులు లేకుండా పంచాయతీల్లో శానిటేషన్ చర్యలు చేపట్టాలన్నారు. దోమలు పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య,రేపాల ప్రాథమిక హాస్పిటల్ వైద్య అధికారి డాక్టర్ శ్రీశైలం, లింగం రామకృష్ణ, లింగయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.