మునిసిపల్ తుది ఓటర్ జాబితా విడుదల
చేసిన మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు.
జోగులాంబ గద్వాల 12 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ పురపాలక సంఘం రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మునిసిపల్ వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా ను నేడు కార్యాలయ ఆవరణలో మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పట్టణంలోని 20 వార్డులకు సంబందించిన తుది ఓటర్ జాబితా ను మునిసిపల్ కార్యాలయం తో పాటు తహసీల్దార్ కార్యాలయం మరియు ఆర్డీఓ కార్యాలయం లో అందుబాటులో ఉంచామని తెలిపారు.
కార్యక్రమం లో మునిసిపల్ మేనేజర్ శ్రీ అశోక్ కుమార్ రెడ్డి , సీనియర్ అసిస్టెంట్ శ్రీ లక్ష్మన్న , సీనియర్ అకౌంటెంట్ శ్రీ ప్రదీప్ చంద్ర , TPBO శ్రీ సాత్విక్ , వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు