ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలి*
మోత్కూర్ లో జరిగే తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలి
అడ్డగూడూరు 02 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రములో ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వళ్ళంభట్ల పూర్ణచంద్రరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నారగోని అంజయ్య గౌడ్, అడ్డగూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,ఈనెల 3వ తేదీన మోత్కూరు మండల కేంద్రంలోని ఎల్ఎన్ గార్డెన్స్ లో ఉదయం 11 గంటలకు జరిగే తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంభట్ల పూర్ణచందర్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్, అడ్డగూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.శనివారం అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..మోత్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సింగల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా విభాగం నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం గారికి, ఇటీవల నూతనంగా నియమితులైన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ళ సోమిరెడ్డికి మరియు ఇటీవల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, నియోజకవర్గంలో నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వల్లంభట్ల రవీందర్రావు, గూడేపు పాండు, బొమ్మగాని లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు పూలపల్లి సోమిరెడ్డి, ఉపాధ్యక్షుడు కడారి రమేష్, చేడే మహేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చేడే అంబేద్కర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్, మాజీ సర్పంచ్ మంద రామచంద్రు, గ్రామ శాఖ అధ్యక్షులు దురుసోజు రవీంద్ర చారి, కన్నెబోయిన లింగస్వామి, బాలశౌరి, రాచకొండ శీను, రవి, నిమ్మల సత్తయ్య, మేడబోయిన లింగయ్య, మంద లక్ష్మణ్, మందుల వెంకటేష్, సమీర్, బోడ పాండు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.