కార్మిక నేస్తం కిశోరన్న
భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జి గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్
తుంగతుర్తి
తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి చెందిన వీరబోయిన శ్రీనివాస్, మరియు వెంపటి గ్రామానికి చెందినరామణబోయిన బిక్షం అనే ఇద్దరు కార్మికులు గత నెల అనారోగ్యంతో మరణించటంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తెలంగాణ కార్మిక సంక్షేమ భీమాను అతి త్వరలో వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జి గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా అయన మాట్లాతు కార్మిక సంక్షేమ ప్రదాత తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా" గాదరి కిశోర్ కుమార్ గారు* ఆనాడు నియోజకవర్గం లో ఉన్న అసంఘటితంగా ఉన్న కార్మికులను సంఘటితము చేసి వారిని చైతన్య పరుస్తూ వారి సంక్షేమానికి నాడు వేసిన బాటలు నేడు అందుతున్న సంక్షేమ ఫలాలకు నిదర్శనం అన్నారు. నిరుపేదలైనా భవన నిర్మాణ రోజువారీ కూలీలకు వారి ఆర్థిక సహకారం అందించిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా రోడ్డు ప్రమాదములకు గురై మరణించిన సాధారణ మరణానికి గాని, మీటర్నిటి, మ్యారేజ్, గాని వచ్చే బీమా డబ్బులు అనేకమంది కుటుంబ సభ్యులకు అందుతున్నాయంటే కిశోర్ అన్న కృషి మరియు సహకారమే, అధికారం ఉన్న లేకపోయినా కార్మిక నేస్తం కిశోరన్న ఎదో ఒక కుటుంబంలో ఎదో ఒక సమయంలో ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడల్లా అయన పేరు ప్రస్తావన కు వస్తూనే ఉంటుందని అన్నారు. రానున్న రోజులలో కార్మిక రంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతము చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు గడ్డంసోమేశ్,మండల ఉపాధ్యక్షులు కూరపాటి సోమేశ్, రాజేష్ తోడేటి వెంకన్న, సతీష్ కుమార్ గడ్డం ఉమా శివ తదితరులు పాల్గొన్నారు.