మిర్యాలగూడలో 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత
పెన్ పహాడ్ మండల వాసి నుండి
ఈరోజు 17.07.2024 రోజు ఉదయం 5 గంటల సమయంలో మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామం వద్ద పోలీస్ వారు వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడెం నుండి ఆంధ్ర వైపుకు వెళుతున్న టాటా ఏసీ వాహనములు గూడ్స్ వాహనం నెం టీఎస్08 డిపి టి ఆర్ 5888 ఈ వాహనం నిండా తెల్ల బస్తాలు నింపిన పిడిఎఫ్ బియ్యం ఇట్టి వాహనంపై ప్లాస్టిక్ పట్టా టార్బల్ కప్పి ఉండటం అనుమానంతో వాహనాన్ని ఆపుటకు ప్రయత్నించగా పోలీసు వారిని చూసి ఆపకుండా పారిపోతుండగా వెంబడించి కొద్ది దూరంలో పట్టుకొని వాహనం తనిఖీ చేయగా అందులో 60 తెల్ల బస్తాలలో సుమారు 30 క్వింటాల వరకు పిడిఎస్ బియ్యం కలిగి ఉన్నాయి డ్రైవర్ని అదుపులోకి తీసుకొని అందులో గల మరో వ్యక్తిని విచారించగా పెన్ పహాడ్ మండలం లోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పిండి పోలు పర్వతాలు పిడిఎస్ బియ్యం లోడ్ చేసి పంపించినాడని వాహనం డ్రైవరు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రాలో నరసింహారావు అను వ్యాపారి వద్ద అన్లోడ్ చేయుటకు పంపిస్తే వెళుతున్నామని తెలిపినారు ఇట్టి అక్రమ పిడిఎస్ బియ్యం లోడును వాహన డ్రైవర్ కార్తీక్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి గోపి, వాహన యజమాని పర్వతాలు, బియ్యం కొనుగోలు చేయు నరసింహారావు అను నలుగురిపై మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది