జూపల్లి కి చిన్నంబావి మండల లో పాలాభిషేకం ఉమేష్ నాయుడు ఆధ్వర్యంలో

Feb 19, 2026 - 20:00
Feb 19, 2026 - 22:13
 0  1
జూపల్లి కి చిన్నంబావి మండల లో పాలాభిషేకం ఉమేష్ నాయుడు ఆధ్వర్యంలో

19-02-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండలంలోఘనంగా జూపల్లి కృష్ణారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చిన్నంబావి మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు ఉమేష్ నాయుడు.

బిసి సామాజిక వర్గ వాల్మీకి ముద్దు బిడ్డ అయిన శ్రీమతి శ్రీ రెడ్డి జ్యోతి సత్యం గారికి కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మెన్ పదవి ఇచ్చినందుకు చిన్నంబావి మండల వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నేడు మంత్రి  జూపల్లి కృష్ణారావు చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం మండల అధ్యక్షుడు ఉమేష్ నాయుడు మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు  వాల్మీకిలను సోదరా భావంతో చూస్తూ ఇటీవల కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఘన విజయం సాధించిన వాల్మీకి ముద్దు బిడ్డ రెడ్డి సత్యం జ్యోతి గారికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం మా వాల్మీకులను ఉన్నత పదవితో గౌరవించడం శుభ పరిమాణమని మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మరోమారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాల్మీకి సోదరులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మున్సిపాలిటీ చైర్మన్ అవకాశం కల్పించి వాల్మీకిల పక్షాన నిలబడడం ఆదర్శనీయమని,జూపల్లి కృష్ణారావు వాల్మీకిలను గుర్తించి కొల్లాపూర్ మునిపల్స్ ఛైర్మెన్ పదవి ఇవ్వడం చాలా సంతోషకరమని ఇప్పటి వరకు కొల్లాపూర్ మున్సిపాల్టీలో వాల్మీకి బోయలకు మొట్ట మొదటి సరిగా చైర్మెన్ పదవి ఇచ్చిన జూపల్లి  గారికి రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేసారు.

అనంతరం వాల్మీకి తాలూకా అధ్యక్షుడు *P రాజుకుమార్ గారు మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అందుకే ఈ రోజు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మెన్ పదవి వాల్మీకి బోయ బిడ్డకు రావడం జరిగిందని తెలిపారు,రానున్న రోజుల్లో అత్యధిక సంఖ్యలో వాల్మీకిల ఉన్నత అవకాశాలు కల్పిస్తూ మాజాతి మనుగడకు కృషి చేయాలన్నారు.

 ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల పరిసర ప్రాంతాల నుండి నాయుడుస్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 తధానాతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగారి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గంలో రాజకీయంగా గుర్తింపు లేని వాల్మీకి కులాని గుర్తించి కొల్లాపూర్ మునిపల్స్ ఎన్నికలో విజయం సాధించిన రెడ్డి జ్యోతి సత్యం గారికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం వాల్మీకి బోయ బిడ్డలు గర్వించదగ్గ విషయమని, బోయలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక నాయకుడు మన మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ గారు అని ఈ సందర్భంగా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల అన్ని గ్రామాల వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State