రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది

Feb 19, 2026 - 22:29
Feb 19, 2026 - 22:31
 0  0
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట, 19 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటీవల  నిర్వహించిన పట్టణ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని   తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ రాష్ట్రంలో  మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కి పైగా మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమైందన్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వమని తెలిపారు. ప్రజా పాలనను పారదర్శకంగా అమలు చేస్తూ, ఆరు గ్యారెంటీలు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షునిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని అభినందించారు.


సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 31 వార్డుల్లో ఘనవిజయం సాధించిందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ రెబల్స్‌గా గెలిచిన నలుగురు స్వతంత్ర సభ్యులతో కలిపి దాదాపు 35 స్థానాల్లో కాంగ్రెస్ బలం నిలిచిందన్నారు. ఈ విజయానికి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపి రఘువీరా రెడ్డి ,  ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య  సహా నాయకులందరూ ఐక్యంగా పనిచేయడం కారణమని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షఫి వుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్ లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల భవాని రమేష్ నాయుడు, నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, ధరావత్ వెంకన్న నాయక్, ధర్మా నాయక్, వల్దాసు దేవేందర్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333