కూతుర్ని కపడబోయీ తండ్రి స్నేహితుణ్ణి కపడబోయీ స్నేహితుడు ముగ్గురు మృతి

Jul 17, 2024 - 19:48
Jul 17, 2024 - 21:08
 0  139
కూతుర్ని కపడబోయీ తండ్రి స్నేహితుణ్ణి కపడబోయీ స్నేహితుడు ముగ్గురు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి బంధువుల ఇంటికి వచ్చి ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత చుట్టపు చూపుగా వచ్చి ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో బొప్పారం లో విషాద ఛాయలు ఆత్మకూర్ ఎస్: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో పల్లె ప్రకృతి అందాలను తిలకిస్తూ ఈత సరదా తో క్వారీ గుంటలో పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన తిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి (40) తన మిత్రుడు రాజు స్వగ్రామం నరసరావుపేట, ఆంధ్ర ప్రదేశ్ (45) కుటుంబం తో కలిసి శ్రిపాల్ రెడ్డి అత్తగారు ఊరు అయిన ఆత్మకూర్ ఎస్ మండలం బొప్పారం గ్రామానికి గత రెండు రోజుల క్రితం ఏకాదశి పండుగ అని వచ్చారు. బుధవారం ఉదయం పల్లె ప్రకృతి అందాలను చూద్దామని శ్రీపాల్ రెడ్డి అతని పెద్ద కుమారుడుచేతన్ రెడ్డి, చామల రాజు అతని ఇద్దరు కూతుర్లు, ఉషాంక (12) రిషిక ,శ్రీపాల్ రెడ్డి వదిన కూతురు వర్షిత మొత్తం ఆరుగురు గ్రామ సమీపంలో ఉన్న బిక్కేరు వాగు వద్దకు వెళ్లి కాసేపు సేద తీరారు. అటు తర్వాత శ్రీపాల్ రెడ్డి మామ ఉపేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద కు వెళ్లి వస్తు చెరువు సమీపంలో ఉన్న క్వారీ లో నీటిని చూసి ఈత కొట్టాలని సరదా పుట్టింది. క్వారీ గుంతలో లోతు తక్కువ ఉంటుందని ఈత సరదా కోసం వెళ్ళారు శ్రీ పాల్ రెడ్డి పెద్ద కొడుకు చేతన్ రెడ్డి కి ఈత వస్తుందని తెలిసి గుoతలోకి దిగి గుంత లోతు చూసి రమ్మన్నారు. గుంత లోతుగా ఉన్నదని చెప్పేలోగా రాజు, అతని పెద్ద కూతురు ఉషాంక, నీటి లోకి దిగారు లోతు ఎక్కువ ఉండడం తో నీటిలోకి జారి పడ్డారు.వారిని కాపాడే ప్రయత్నం లో శ్రీపాల్ రెడ్డి నీటి దగ్గరికి వెల్లి నీటిలో జారి పడ్డాడు. అదే సమయంలో రాజు చిన్న కూతురు రితిక కూడా నీటిలో కి జారిoది .ఈత వచ్చిన చేతన్ రెడ్డి చిన్న కూతురు రీతికను బయటికి తీసుకొచ్చాడు.

అప్పటికే రాజు, ఉషాంక,శ్రీపాల్ రెడ్డిలు నీటిలో మునిగిపోయారు. బయట ఉన్న రాజు చిన్న కూతురు శ్రీపాల్ రెడ్డి బంధువుల అమ్మాయి బంధువులకు ఫోన్ చేసి సమాచారం చెప్పి కేకలు వేయడం తో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఈత రాకపోవడం తో అప్పటికే శ్రీపాల్ రెడ్డి ,రాజు, ఉషాంక లు నీటిలో మునిగి మృతి చెందారు. శ్రీపాల్ రెడ్డి ఖమ్మంలో బిల్డర్ గా పనిచేస్తున్నారు. రాజుది ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట కాగా గత కొంతకాలంగా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు రాజు భార్య శ్రీపాల్ రెడ్డి భార్య క్లాస్ మెంట్ లు కావడంతో వారు రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డి.ఎస్.పి రవి, సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై సైదులు సంఘటన స్థలానికి చేరుకొని మృతులను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. క్వారీ చేపట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి: గ్రామస్తులు క్వారీ చేపట్టడంతో చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బ చెట్టు ఉన్నాయని వారి ద్వారా పెద్ద పెద్ద గోతులు, బండలు ఏర్పడ్డాయని దాని ద్వారా తరచూ పశువుల తో పాటు మనుషులు కూడా ప్రమాదాల గురి అవుతున్నారని వారి చేపట్టిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.