మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు...... వేమూరి
మునగాల 05 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ మండల నాయకులు వేమూరి సత్యనారాయణ ఒక సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఒక రోడ్ షోలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పై సంక్షేమ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించు కుంటున్నారని అదేవిధంగా అవసరమైతే మీరు కూడా బస్సులో ప్రయాణించవచ్చని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు. ప్రజలకు ఇస్తానన్న పథకాలపై హామీలపై ప్రశ్నించడం పరిపాటని అదేవిధంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా. ప్రచారంలో భాగంగా అధికార పార్టీని నిలదీయడం సహజమని అంతమాత్రాన. ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని భరోసా కల్పించి. రాజకీయంగా లబ్ధి పొందే విధంగా ప్రచారాలు ఉండాలి తప్ప ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం. సబబు కాదని, ప్రజా ప్రతినిధులు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి. సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడం బాధాకరమని అన్నారు.