పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సంపాదించిన కారపాటి భవ్యకి ఘనంగా సన్మానం

May 5, 2024 - 21:25
 0  9
పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సంపాదించిన కారపాటి భవ్యకి ఘనంగా సన్మానం

పాలకీడు 05 మే 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి ;-

పాలకీడు మండల కేంద్రం లోని మహంకాళి గూడెం గ్రామం నకు చెందిన కారపాటి  తండ్రి సైదులు (మరియదాసు) కుమార్తె భవ్య ఇటీవల  విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో  10/10 సాధించినది , ఈ సందర్భముగా మహంకాళి  గూడెం గ్రామ పెద్దలు భవ్య ను  ఘణంగా సత్కరించడం జరిగింది.అనంతరం కత్తి దానయ్య మాట్లాడుతూ గ్రామం ఏర్పడిన నుండి ఇంతవరకు  రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించలేదని, ఈరోజు కారపాటి భవ్య గురుకులాల్లో చదివి రాష్ట్ర స్థాయిలో మన గ్రామానికి, తల్లి దండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది అని  భవ్యకు గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.అలాగే గ్రామంలో ముందు ముందు కారపాటి భవ్య లాగే విద్యార్థులు  చదివి లో ప్రతిభ  చూపించి మన  గ్రామానికి, తల్లి దండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి దానయ్య, జిల్లా ప్రసాద్, పిడమర్తి దావీదు, ఇంక గ్రామ పెద్దలు పాల్గొని కారపాటి భవ్య కి అభినందనలు తెలిపారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State