బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

Feb 23, 2026 - 19:16
 0  0
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బాధితుల సమస్యల దిశగా, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువాయే దిశగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,. తెలిపారు.

ఈ రోజు గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి 10 ఫిర్యాదులు స్వీకరించడo జరిగింది. అనంతరం పిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు  ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..... ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు.
    
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
ఈరోజు వచ్చిన ఫిర్యాదులలో 
 భూవివాదాలకు సంబంధించి - 03, గొడవలకు సంబంధించి -03, డబ్బులు తీసుకుని మోసం  చేయడంకు సంబంధించి  -01, ఇతర అంశాలకు సంబంధించి -03 ఫిర్యాదులు రావడం జరిగింది అని పిఆర్ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు . 


.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333