మహిళలు మహారాణులు మహిళ శ్రీ శక్తి అవార్డ్స్

Mar 9, 2025 - 19:00
 0  3
మహిళలు మహారాణులు మహిళ శ్రీ శక్తి అవార్డ్స్

*మహిళలు మహారాణులు మహిళ శ్రీ శక్తి అవార్డ్స్* 

 ఖమ్మం నగరంలో వైరా రోడ్ లో గల పసుమర్తి ఫంక్షన్ హాల్ లో ఖమ్మం పౌర సమితి , మహాత్మా గాంధీ ఫౌండేషన్ , పులిపాటి నగర్ వాసవి క్లబ్ , పులిపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 18 మంది మహిళా మనులకు శ్రీశక్తి అవార్డు ప్రదానం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సేవాగుల సంపన్నుడు , పౌర సమితి అధ్యక్షులు పులిపాటి ప్రసాద్ పాల్గొని గత పది సంవత్సరాల నుండి అనేక రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలను గుర్తించి సేవా అవార్డులు అందిస్తు శాలువతో సత్కరించి మాట్లాడారు . ఖమ్మం జిల్లాలోని కనివిని ఎరుగని రీతిలో కార్యక్రమం జరిగిందని , ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించామని , విభిన్న అన్ని రంగాల్లో సేవా భావంతో... పనిచేస్తున్న మహిళలు ను సత్కారించటం సంతోషం అని తెలియజేశారు . పౌరసమితి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ముందు ఉంటుంది అని అన్నారు . ఈ కార్యక్రమం లో పౌరసమితి షేక్ ఖాసీమ్ , వరప్రసాద్ , బొగ్గవరపు సతీష్ , పసుమర్తి శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర* ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ ,కొల్లూరు కృష్ణమూర్తి , పద్మజరెడ్డి , శ్రీ కళ రెడ్డి , గుమ్మడవెల్లి శ్రీనివాస్ , పలువురు ప్రముఖులు , మరియు పులిపాటి పారా , మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ , స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333