కేటాయించిన వన మహోత్సవ లక్ష్యాలను వంద శాంతం సాధించాలి:జిల్లా కలెక్టర్    

Jul 15, 2024 - 18:55
Jul 15, 2024 - 19:03
 0  9
కేటాయించిన వన మహోత్సవ లక్ష్యాలను వంద శాంతం సాధించాలి:జిల్లా కలెక్టర్    

జోగులంబ గద్వాల 16 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:-విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని  జిల్లా కలెక్టర్ బి. యం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి  శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్  మొక్కలు నాటి అందరిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.  భావితరాల మనుగడకు మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు.

 ఈ సందర్భంగా 15  లక్షల మొక్కలు నాటేందుకు  జోగులాంబ గద్వాల్ జిల్లాకు లక్ష్యంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  గ్రామలకు 2.8 లక్షల మొక్కలను ఇప్పటికే పంపిణి చేయాడం జరిగిందని, అన్ని గ్రామ మండల స్థాయిలో ఎం.పి.డి.ఓ లు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 35 శాతం మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జులై, ఆగస్టు మాసాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ఈ రెండు నెలలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించే విధంగా మొక్కలు నాటి అట్టి మొక్కలను   సంరక్షించాలన్నారు.  అన్ని ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు భాద్యతగా మొక్కలు నాటలన్నారు. ఆలోచన బాగున్నా ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవని, నాటిన ప్రతి మొక్కను ఎంతో భాద్యతతో సంరక్షించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వర్లు, నర్సింగ రావు , జెడ్పి సి.ఈ.ఓ  కాంతమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State