మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్"బి భార్గవి

అడ్డగూడూరు 25 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్నీ వైద్య అధికారి డాక్టర్"భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు,షుగర్, హీమోగ్లోబిన్,వంటి పరీక్షలు నిర్వహించి, వారికి మందులు అందించారు.గర్భిణీ స్త్రీలు,తల్లులు, చిన్నారులకు అవసరమైన వైద్య సూచనలు, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ డాక్టర్"సృజన, గైనకాలజిస్ట్ డాక్టర్" సుప్రియ,పీడియాట్రిషన్ డాక్టర్"కవిత,కంటి స్పెషలిస్ట్ డాక్టర్" వాసుదేవ్ ప్రత్యేకంగా పాల్గొని పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్"బి భార్గవి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన మహిళే ప్రతి కుటుంబానికి,సమాజానికి మూలస్తంభం.ప్రతి ఒక్కరూ తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.