మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలిగా.. పులి సత్యమ్మ.

తుంగతుర్తి ఫిబ్రవరి 12 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మండల పరిధిలో గానుబండ గ్రామానికి చెందిన పులి సత్యమ్మ ఎన్నికయ్యారు. ఈమెరకు ఆమెకు సూర్యాపేటలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వేములకొండ పద్మ. జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతా రావుకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మండలంలో అభివృద్ధి చేసేందుకు తను కృషి చేయడంతో పాటు స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ లో చురుకైన పాత్ర పోషిస్తూ గ్రామంలో నాయకులకు కార్యకర్తలకు అండదండలతో ఐకమత్యంతో పార్టీ బలోపేతం చేస్తామన్నారు రాబోయే గ్రామస్థాయి మండల స్థాయి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల మహిళా మోర్చా కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. .