మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు

మానవపాడు. మండలం లోని మానవపాడు నుండి చందాపూర్ వరకు రైతులకు ఉపయోగపడే రహదారి నిర్మాణ పనులు పరిశీలించి, గ్రామీణ ప్రాంత రైతుల రవాణా సౌకర్యాల మెరుగుదలకు తోడ్పడే ఈ రోడ్ ఫార్మేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆలంపూర్ మండలంలోని ర్యాలంలాడు గ్రామంలో పశుకొ ట్టాల నిర్మాణం,నర్సరీ అభివృద్ధి పనులను పరిశీలించారు.పనుల నాణ్యతను సమీక్షించిన అధికారులు వేగవంతంగా సమయపాలనతో పనులను పూర్తి చేయాలని సూచించారు. నర్సరీలను సమర్థవంతంగా నిర్వహించి జూన్ నాటికి నర్సరీలోని మొక్కలు కనీసం మీటర్ ఎత్తులో ఉండేలా అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అలంపూర్ లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉండేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వంద శాతం పని దినాలు కల్పించాలి...లేబర్ డిమాండ్ పై ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి పనిని సమర్థవంతంగా అమలు చేయాలనీ, ఉపాధి హామీ కూలీలకు నిరంతరంగా ఉపాధి కల్పించాలనీ అధికారులకు సూచించారు. గ్రామాల వారీగా మైక్రో ప్లాన్లు సిద్ధం చేసి, లేబర్ మోబిలైజేషన్‌కు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో 100 మంది కూలీలు హాజరు అయ్యేలా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశించారు. కూలీలకు వేసవి కాలం నేపథ్యంలో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడంతో పాటు కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు పద్మావతి,భాస్కర్,కేజీబీవీ ప్రిన్సిపాల్ కృష్ణవేణి, ఏపీఓలు పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు,
పాల్గొన్నారు.