**శబరిమల అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా"ముఖ్యఅతిథిగా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : ది 11-4-2025 శబరిమలై కొండల్లో కొలువైయున్న హరి హర సుతుడు ఆనంద చిత్రుడు అయ్యన్ అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో దేవాలయ కమిటీ వారి సహకారంతో శ్రీ మణికంఠ భక్త బృందం సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ పట్టణ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు గారు కోదాడ పట్టణ మున్సిపాలిటీ మాజీ వార్డు కౌన్సిలర్ బత్తిని హనుమంతరావు గారు దేవాలయ కార్యదర్శి చల్లారా మూర్తి గారు ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య గారు సహాయ కార్యదర్శి సురభి నరసయ్య గారు మణికంఠ భక్త బృంద సభ్యులు రావెళ్ల కృష్ణారావు చౌదరి తూముల శివప్రసాద్ గురుస్వామి ఈదుల పురం శీను గురుస్వామి తమ్మన వెంకట నాగ అవతారం గడ్డం శ్రీనివాస్ రెడ్డి గజ్జి సోమేశ్వరరావు మరియు ఓరుగంటి శీను గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు 1200 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు