మణుగూరు మండలంలో పెద్దపెల్లి గ్రామంలో శుభ్రత కార్యక్రమం
మణుగూరు 02 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మణుగూరు మండల పరిధిలోని రమానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దపెల్లి గ్రామంలో శుభ్రత–పరిశుభ్రత కార్యక్రమంలో కర్నే రవి ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచే భాగంగా రోడ్డు రెండు వైపుల ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు న్యాయవాది కర్నె రవి,న్యాయవాది నాగార్జున రెడ్డి,బోడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా సహకరించి, పరిశుభ్ర గ్రామం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.