మడత పేచీ లు కొర్రీలు లేని.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో చూడలేమా
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో మరో నియోజకవర్గంలో విచ్చలవిడిగా మిల్లర్లు రెచ్చిపోయి మరి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోళ్లు జరుపుతూ జరుపుతూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న రైతులు నష్టపోవడం నయవంచనకు గురి కావటం యధావిధిగా జరిగే తంతేనని రైతు సంఘాల ప్రతినిధులు రైతులు అంటున్నారు. మిల్లర్లపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా యావత్ ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలలో జరుగుతోందని ప్రధానంగా నేలకొండపల్లి మండలంలో పర్యవేక్షణ అంతగా ఉండదని దీంతో మిల్లర్లు ప్రతి ఏడాది కౌంటర్లు తెరిచి మరి అందిన కాడి కి దోచుకోవడం.. పరిపాటిగా మారింది. సీఎంఆర్ఎఫ్ బియ్యాన్ని కూడా గడువులోగా అందించిన మిల్లర్లు ఎవరు..? ఇంకా పెండింగ్ లో ఉన్న వారిపై కూడా అంతగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఇప్పటికైనా మార్కెటింగ్ వ్యవసాయ రెవెన్యూ శాఖలు సమన్వయంగా వ్యవహరించి తనిఖీలు నిర్వహించి అక్రమాల అడ్డుకట్టను పెంచుతారా చర్యలు తీసుకుంటారా యధావిధిగా వదిలేస్తారా అనేది భవిష్యత్తులో వెల్లడి కానున్నది.