మండల మహిళా సమైక్య కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
మద్దిరాల 26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఆదివారం ఉదయం మండల మహిళా సమైక్య కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీఎం మైసయ్య జెండాను ఆవిష్కరించారు. సీసీలు నాగార్జున రెడ్డి, రమేష్, మండల సమైక్య అధ్యక్షురాలు ఉప్పమ్మ, మరియు వివోఏలు పిఆర్పి దండే.మమత తదితరులు పాల్గొన్నారు.