బొప్పారం క్వారీ చుట్టూ ముళ్ళకొచ్చే, హెచ్చరిక బోర్డులను

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ బొప్పారం క్వారీ చుట్టూ ముళ్ళకొచ్చే, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన పోలీసులు.... ఆత్మకూర్ ఎస్... వెంకి పెళ్లి సుబ్బు.. చావుకొచ్చినట్లు ... క్వారీ లీజుకు తీసుకొని కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ రాయిని అమ్ముకొని గాలికి వదిలేసి గాతుల్లో పడి అమాయకులు, మూగజీవాలు మృతి చెందడంతో చట్టపరంగా పోలీసులకు తప్పని ఇబ్బందుల కారణంగా చివరికి పోలీసులే క్వారీ గుంటల చుట్టూ ముళ్ళకంచవేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరాల్లోకి వెళితే... ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామంలో గత పదివేల క్రితం పాల్వంచ కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ వీరు నాయక్ బొప్పారంలో క్వారీ స్థలాన్ని కొనుగోలు చేసి విలువైన గ్రానైట్ రాయిని తవ్వుకొని అమ్ముకున్నాడు. గత మూడు ఏళ్లుగా క్వారీలో తవ్వకాలు నిలిపివేసి భారీ గుంటలను వదిలేసి వెళ్లాడు. ఆ గుంటల్లో వర్షాలకు నీరు చేరడంతో తరచూ ప్రమాదాలు సంభవించి పశుపక్షాదులతో పాటు ఇటీవల నలుగురు వ్యక్తులు మృతి చెందారు. భారీ గుంతల్లో రాళ్ల మధ్యన శవాలు చెక్కి అవి తీసేందుకు పోలీసులకు ప్రాణ సంకటoగా మారింది. ఈ విషయం పోలీసులు మైనింగ్ శాఖకు ఎన్ని ఫిర్యాదులు చేసినా క్వారీ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కనీసం క్వారీ లీజు రద్దుచేసి గుంటలు పూడ్చే ప్రయత్నం చేయకపోవడంతో పోలీసులే పూనుకొని బుధవారం క్వారీ గుంతల చుట్టూ ముళ్ళకంప తో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మైనింగ్ అధికారులు ఇప్పటికైనా క్వారీల యజమానుల నిర్లక్ష్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.