కిశోర బాలికలను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని

Jun 6, 2024 - 19:52
Jun 6, 2024 - 20:04
 0  9
కిశోర బాలికలను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఆత్మకూరు మండలం వివిధ గ్రామాల కిషోర్ బాలికల అందరూ కలిసి సూర్యాపేట జిల్లా తెలంగాణ బాలికల సమానత్వ సమాఖ్య గా ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశంలో బాలికల ఉన్నత విద్య అవకాశాలు, మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం జరిగింది, గ్రామాలలోని బాలికలు ఉన్నవిద్య కు వెళ్ళడానికి రవాణా, బస్సు సౌకర్యం లేనందు వల్ల విద్య కొనసాగించలేక పోతున్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే గ్రామాలకు బస్సు లను అందుబాటులోకి తీసుకురావాలని,అలాగే గత ప్రభుత్వం బాలికలకు అరోగ్య రక్షణ కిట్టు( సానిటరీ ప్యాడ్) పాఠశాలలో అందించాలని, కోరారు, ఈ కార్య క్రమంలో 20 గ్రామాల కిషోర్ బాలికల ప్రతినిధులు 50 మంది పాల్గొన్నారు.జై భాస్కర్ సార్ .ఎంవీ. ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్.. మండల ఇన్చార్జి వత్సవాయి లలిత. ఆర్గనైజర్లు సైదులు జయలలిత మంజుల కిశోర బాలికలు శ్రీజ మాధవి, నవ్య ప్రీతి మనిషా అఖిల అనుష వైష్ణవి. పూజ శృతి మౌనిక తదితరులు పాల్గొన్నారు