పేదల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామెల్

Sep 11, 2024 - 21:37
Sep 11, 2024 - 21:54
 0  256
పేదల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామెల్

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీకి  పేరు పెట్టడం చాలా సంతోషం 

ఆశీర్వదించారు అభివృద్ధి చేసి చూపిస్తా 

అతి త్వరలో ఎస్సారెస్పీ నీరు విడుదల 

రాష్ట్రంలో మొదటి వరుసలో తుంగతుర్తి నియోజకవర్గం నిలబెడుత

 అతి త్వరలో ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం

  తొండ గ్రామంలో ఎల్కేజీ టు పీజీ త్వరలో ప్రారంభం 

తిరుమలగిరిలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తా

తిరుమలగిరి 12 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం రజక పాలనలో ఎదురింటి నిలిచిన భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరును ఎస్సారెస్పీ కాల్వకు పేరు పెట్టాలని కోరారు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్  చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి హైదరాబాదులోని మహిళా యూనివర్సిటీకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణం,చరిత్రలో లిఖించబడిన విషయం  అని అన్నారు. ఆమె పేరు పట్ల సీఎం రేవంత్ రెడ్డికి నిండుగా ధన్యవాదాలు తెలుపుతున్న అని అన్నారు. తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధంగా ఆ నిర్ణయం ఉందని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో కొంగు నడుముకు కట్టుకొని కొడవలి పట్టుకుని భూస్వాములకు ఎదురోడ్డి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి  సభలో ఉన్న రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఒప్పించి చాకలి ఐలమ్మను గౌరవించి ఆమె  మనుమరాలికి మహిళా కమిషన్ లో సభ్యులుగా ఇవ్వడం గర్వకారణం అన్నారు.గత ప్రభుత్వం ప్రగతి భవన్ అని విర్రవీగిన  బీ.ఆర్.ఎస్ నాయకులు  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే  జ్యోతి బా  పూలే గా నామకరణం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం మొదటి వరుసలో నిలబెడతా తుంగతుర్తి నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం లోని ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా ఉన్న జూనియర్ కళాశాల ఏర్పరచలేదు విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్నది కళాశాల ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా వెంటనే మంజూరు లెటర్ ను అందించారు తుంగతుర్తి నియోజకవర్గం లోని చెరువులు కుంటలు నిండుగా తలపిస్తున్నాయి అతి త్వరలోనే ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ రాములు సుంకరి జనార్దన్ పేరాల వీరేష్ జుమ్మిలాల్ పాలకుర్తి రాజయ్య కందుకూరి లక్ష్మయ్య సుధాకర్ రషీద్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333