బైండోవర్ ఉల్లంఘనలపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు
29 బ్రిచ్ కేసుల్లో రూ.9.31 లక్షల జరిమానా వసూలు
బోథ్ నియోజకవర్గం న్యూస్ జనవరి 12 (తెలంగాణ వార్త) : గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ విజయ్ (శ్రావణ్ కుమారుడు) పలుమార్లు గుడుంబా తయారు చేస్తూ పట్టుబడటంతో అతనిపై బైండోవర్ నమోదు చేశారు. అనంతరం బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.40,000 జరిమానా విధించారు. అలాగే నేరడిగొండ మండలం వాగ్ధరి గ్రామానికి చెందిన రాథోడ్ సలంత (వినోద్ భార్య) కూడా పలుమార్లు గుడుంబా తయారు చేస్తూ దొరకడంతో బైండోవర్ ఉల్లంఘన కింద ఆమెపై రూ.21,000 జరిమానా విధించారు. ఈ ఇద్దరి నుండి ఈ రోజు చలాన్ రూపంలో మొత్తం రూ.61,000 జరిమానాను వసూలు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు మొత్తం 29 బ్రిచ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటిలో 26 మందినుంచి రూ.9,31,000 జరిమానా వసూలు చేయగా, మరో ముగ్గురు వ్యక్తులను జైలుకు పంపినట్లు వివరించారు. బెల్లం, గుడుంబా అమ్మకం, తయారీ లేదా అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జుల్ఫికర్ అహ్మద్ హెచ్చరించారు.