ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్
బోథ్ నియోజకవర్గం న్యూస్ జనవరి 12 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, భద్రతా అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, యువ నాయకులు యండి సద్దాం, రాం లక్ష్మణ్, మౌలానా తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.