బెడ్లు లేక.. నేలపైనే చిన్నారికి చికిత్స
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి.
జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 2026తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల:- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో బెడ్లు అందుబాటులో లేక ఓ చిన్నారిని నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్న దృశ్యం కనిపించింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారుల వార్డులో అదనపు బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పరిశుభ్రత, మౌలిక వసతులను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు.? పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.