విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

Mar 7, 2025 - 20:52
 0  3
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు  తీసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి* సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రమణ గారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆత్మకూరు ఎస్ మండల ఎంపీడీవో హసీం గారికి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సూర్యాపేట జిల్లా రిప్రెసెంటేటివ్ గోపగాని రవికుమార్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొప్పారం గ్రామ కార్యదర్శి రోజువారీగా గ్రామపంచాయతీ కాని, గ్రామానికి కాని హాజరవడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.. దీనికి ఉదాహరణగా గ్రామంలో 76 సంవత్సరాల వృద్ధురాలు అయినా గోపగాని పెద్దపుల్లమ్మ గారి నల్ల కనెక్షన్ ఇచ్చేందుకు, నెల రోజులుగా గ్రామపంచాయతీకి చుట్టూ తిరుగుతున్న గ్రామ కార్యదర్శి దగ్గర నుండి స్పందన లేదన్నారు, గత ప్రజా పాలన దరఖాస్తుల సమయంలో కాని, ఇందిరమ్మ ఇండ్ల డేటాని ప్రభుత్వ అప్ లో అప్లోడ్ చేయడంలో గాని నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు, గ్రామంలో ప్రభుత్వ బోర్ నుండి వచ్చే తాగునీటిని సక్రమంగా సరఫరా అయితున్నాయా లేదా అని చూడకుండా, గ్రామంలో వృధాగా నీరు పోతున్నా కూడా పట్టించుకునే వారు లేరన్నారు.. కొత్త వితంతు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల విషయంలో కూడా గ్రామ ప్రజలకు సరైన సమాధానం గ్రామ కార్యదర్శిగా ఆమె ఇవ్వదన్నారు... అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలు విషయంలో, సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు తెలియజేయడం లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.. గతంలో ఈమె కార్యదర్శిగా పనిచేసిన గ్రామాలైనటువంటి కోటపాడు నిమ్మికల్ కూడా వివాదాలు తోనే పని చేసిందన్నారు అంతేకాదు ఇంటి పన్ను పేరుతో వసూలు చేస్తున్న డబ్బులను కూడా గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేసిందో లేదో అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.. అలాగే గ్రామంలో ఉన్నటువంటి కారోబార్లు మరొక కార్యదర్శిగా గ్రామంలో వ్యవహరిస్తూ, గ్రామంలో గాని ఎంపీడీవో ఆఫీస్ లో గాని కార్యదర్శి చేయవలసినటువంటి పనులను కారోబార్లే నిర్వర్తించడం వలన గ్రామ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు.. ప్రజా పాలన దరఖాస్తులు ఇచ్చే సమయంలో కారోబార్లు టైం అయిపోయింది అని తిరస్కరించి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టినా సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు... గత ప్రభుత్వంలో బొప్పారం గ్రామపంచాయతీలో అభివృద్ధి పేరుతో ఐదు సంవత్సరాల కాలంలో ఒక కోటి రూపాయలు డ్రా చేయగా అందులో దాదాపు 75 లక్షల రూపాయలు అవినీతి సొమ్ము గ్రామంలోని చిన్న పెద్ద నాయకులు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందని అయన అన్నారు..అందుచేత ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామ కార్యదర్శి పై మరియు సిబ్బంది పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఈ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు *మీ గోపగాని రవికుమార్*