వాడి వేడిగా అధికారులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల మధ్య  సమావేశం

Dec 7, 2024 - 16:21
 0  12
వాడి వేడిగా అధికారులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల మధ్య  సమావేశం

జోగులాంబ గద్వాల 7 డిసెంబర్ 224 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఉండవెల్లి  మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.సమావేశం వాడి వేడిగా అధికారులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల మధ్య  కొనసాగింది. సిసిఐ పత్తి కొనుగోలు నందు బ్రోకర్ మాయాజాలం చేసి, నిజమైన రైతుల పత్తిని కొనడం లేదని, మార్కెట్ యాడ్ కమిటీ ఉందా.లేదా అని రైతులు మండిపోవడం ఎవరికోసమని, వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్యోగులు చేస్తున్న తప్పులకు మార్కెట్ యార్డ్ కమిటీపై రైతులు అబండాలు వేస్తున్నారని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప మండిపడ్డారు.మార్కెట్ యార్డులో ఉద్యోగం చేయాలనుకుంటే చేయండి.లేదా లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోమని మండిపడ్డారు. ఇప్పటివరకు వెయ్యి మంది రైతుల పత్తిని కొనుగోలు చేశామని, సుమారురూ. 23 కోట్ల 65 లక్షల 83 వేలను రైతులకు చెల్లించమని, 73 మంది రైతులకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఎల్ల స్వామి తెలిపాడు. ఒరిజినల్ గా 100 టోకెన్లకు సంబంధించిన రైతుల మాత్రమే ఉన్నారని, జిరాక్స్ పేపర్ తో వచ్చిన రైతుల పత్తిని కొనమంటారా లేదా మీరే చెప్పాలని వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి మార్కెట్ యార్డ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు మా సంతకాలును కలర్ జిరాక్స్ చేసి అనుమతులు ఉన్నాయనీ కూడా చెప్పడం మా దృష్టికి వచ్చిందని ఆ అధికారి వాపోయాడు. బ్రోకర్ల మాయాజాలంతో సీసీఐ నిండిపోయిందే తప్ప నిజమైన రైతుల పత్తిని కొన్న దాఖలాలు లేవని, దీంతో మార్కెట్ కమిటీకి చెడ్డపేరు వస్తుందని వైస్ చైర్మన్ కుమార్ మండిపడ్డారు.ఒక్క రైతుకు సంబంధించిన పత్తిని కూడా కొనుగోలు చేయించకపోతే మన పోస్టులు ఉండి ఏమి లాభమని సభ్యులు ప్రశ్నించారు. ఇప్పటివరకు కేవలం 21 రోజులు మాత్రమే పత్తిని కొనుగోలు చేశారని, మిగతా పత్తిని ఎలా కొంటారో చెప్పాలని మండిపడ్డారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి మాత్రం తగ్గేదిలేదు అన్నట్లుగా... బ్రోకర్ల మాయాజాలం మా పని కాదని, ఎవరితోనైనా ఒక్క రూపాయి తీసుకొని పత్తిని కొనుగోలు చేయించి ఉంటే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా అని గట్టిగానే సమాధానం ఇచ్చాడు. మార్చి 31 వరకు కొనుగోలు చేస్తామని, రోజుకు 1200 క్వింటాళ్ల పత్తినీ రైతుల ద్వారా కొంటామని కార్యదర్శి చెప్పుకొచ్చాడు.మా ఉద్యోగం మేము చేస్తున్నామని, ఎక్కడ కూడా రైతులను నొప్పించే పని మేము చేయడం లేదని తెలిపారు. రైతుల పట్ల ఏ ఉద్యోగి కూడా నిర్లక్ష్యం చేయకుండా పండిన పత్తిని మొత్తం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని సభ్యులు సభ్యులు తీర్మానం చేశారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ కు ఉన్న స్థలాన్ని పూర్తిగా ప్రభుత్వ సర్వే చేయించి.ఆ తర్వాతే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, మార్కెట్ యార్డ్ స్థలం చాలా చోట్ల కబ్జా అయిందని సభ్యుడు శ్రీకాంత్ తెలిపాడు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333