ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

Sep 2, 2026 - 19:35
 0  13
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

విద్యార్థులకు హెల్త్ కార్డులు అందజేసేందుకు చర్యలు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 226 తెలంగాణ వార్త ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రిలలోనే ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున అవగాహన కల్పించి కాన్పులు జరిగే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్. వైద్యశాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని, ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేయడం తగదన్నారు. ఆలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది ఉన్నారని, అక్కడ వైద్య సేవలు పెరిగేలా నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులు తరచు మెడికల్ అధికారులతో సమావేశాలు నిర్వహించి, మెరుగైన పనితీరు కనబరిచేలా దశానిర్దేశం చేయాలన్నారు. టీ హబ్ కు వివిధ పరీక్షల శాంపిల్స్ పంపించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్సీడీ స్క్రీనింగ్ పెరగాలని బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి అవసరమైన మందులను అందజేయాలన్నారు. ఎమ్మెల్ హెచ్ పి (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్) సేవలను వినియోగించుకోవాలని, పోషణ్ కిట్స్ ను టీబి వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని విద్యాసంస్థల విద్యార్థులకు హెల్త్ కార్డులను అందజేసేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ ను వారంలోగా రూపొందించి అందించాల్సిందిగా ఆయా పిహెచ్సిల మెడికల్ అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, 
డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ప్రోగ్రాం అధికారులు రాజు, రామచంద్రరావు, అస్గర్ అలీ,  ప్రసూనరాణి, ఇతర వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333