18 గంటలకు కరెంటు కోసం కె.టి దొడ్డి మండలంలో రైతుల ఆందోళన
రైతులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే.
గద్వాల:-ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కె. టి దొడ్డి మండలంలోని నందిన్నె సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి వద్ద వ్యవసాయానికి దగ్గర 18 గంటల కరెంట్ డిమాండ్ చేస్తూ రైతులు పెద్దఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ విషయంలో వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వెంటనే నిరసన కార్యక్రమంలో చేరుకొని రైతులు లకు సంఘీభావం తెలిపి రైతులు మాట్లాడి వారి సమస్యను విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతుల నిరసన తీవ్రతను గుర్తించిన విద్యుత్ శాఖ ఎస్ఈ (SE), డిఈ (DE) అధికారులు కూడా వెంటనే ధర్నా ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రైతుల ఇబ్బందిని ప్రత్యక్షంగా తెలుసుకున్న రైతులు కరెంటు వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో కరెంటు ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.రైతులు ఎమ్మెల్యే అధికారులు కరెంటు వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను నిరసన కార్యక్రమం విరమించారు చేసుకున్నారు.ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ...రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేసి రైతు కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే వాట్సాప్ లో మెసేజ్ ను చూసి రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులకు తో మాట్లాడి రైతు లేకపోతే రాజ్యం లేదు కాబట్టి రైతులకు కరెంటు 18 గంటల కరెంటు వచ్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే రైతుల సమస్యలను పరిశీలించాలి ప్రస్తుతం వర్షాకాలం సమయం కావడంతో రైతులు నాటు వేసుకోవడం జరిగింది రైతులకు నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 18 గంటల కరెంటు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రస్తుతం వ్యవసాయ పనుల కాలం కాబట్టి ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతులు మోటార్ల ద్వారా నీళ్లను పొలాలకు పంపించడం జరుగుతుంది. కొన్ని దగ్గర లో వోల్టేజ్ సమస్య ఉండడంతో కరెంటు సరింగా రావడం లేదు రాత్రి నుండి 12 గంటల కరెంటు ప్రస్తుతం రైతులకు అందించడం జరుగుతుంది వారు 18 గంటల కరెంటు కోడడంతో అధికారులు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు 18 గంటల కరెంటు వచ్చే విధంగా ప్రయత్నించాలని కోరారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సరైన సమయంలో వర్షాలు లేక లెనోవా ప్రభావంతో కరువు రైతులకు కుంటల ద్వారా నీళ్లను నిలువ ఉంచి వార పద్ధతిలో దశలవారీగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా కరెంటును కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 18 గంటల కరెంటు అందిస్తే రైతులు అన్నదాతలు బతకడానికి సాధ్యమవుతుంది రైతు అభివృద్ధి చెందితే దేశం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.గంగంపల్లి దగ్గర 50 కేమ్ల విద్యుత్ సబ్స్టేషన్ కొంత ప్రాబ్లం ఇబ్బందిగా ఉన్నది తో 16 కేమ్ల రైతులకు కరెంటు లేకపోవడం జరుగుతుంది వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కొత్త ట్రాన్స్ఫారం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అధికారులు కృషి చేయాలని వారం పది రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.ప్రభుత్వం దృష్టికి సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో లోని రైతులకు 18 గంటలు కరెంటు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంతు, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడ, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి, సర్పంచులు, నాయకులు ఊరుకుందు, యుగేందర్ గౌడ్, రంగారెడ్డి,గోపి, తిక్కన వీరేష్,మహదేవ్, యూత్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.