బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
తిరుమలగిరి 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి పట్టణంలో ప్రముఖ వ్యాపారి బుక్క లక్ష్మణ్ కుమార్తె బుక్క సారికా గ్రూప్ 2 లో మాత శిశు సంక్షేమ శాఖ లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం పొంది కొడకండ్ల మండలంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు, బుక్క సారికా కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు మాట్లాడుతూ చదువును ఇష్టపడి కష్టపడి చదివితే గొప్ప గొప్ప విజయాలతో పాటు, ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవోచ్చని అన్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే, పిల్లలు వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రుల కలలను నిజం చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఉద్యోగం, రావడం వల్ల తల్లిదండ్రులకు, గురువులకు, బందువులకు, పట్టణానికి మంచి పేరు రావడం జరుగుతుంది అన్నారు. మన యొక్క తెలివితేటలను, జ్ఞానాన్ని ఉపయోగించి ఇంకా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోని సమాజానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తగట్టు మల్లయ్య, డాక్టర్ రామచంద్రన్ గౌడ్, గిలకత్తుల రాము గౌడ్, కందుకూరి ప్రవీణ్, ముద్దంగుల యాదగిరి, పోరెల్ల లక్ష్మయ్య, పులిమామిడి సోమయ్య, తుమ్మ చంద్రమౌళి, సుంకర కిరణ్, కాసిం, విజయ్ కుమార్, ఉదయ్, దేవులపల్లి గణేష్, గూడూరు వెంకన్న, శీలం ఉపేందర్ గౌడ్, వంగరి సోమకృష్ణ, లక్ష్మణ్, శ్రీధర్, పొదిలా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు....